ఆ ఇంటి గోడల్లో ఎంత బంగారమో..!

Demolition Team Finds Gold Coins In Abandoned House - Sakshi

క్విమర్‌ : పాడుబడిందని కూలిస్తే లక్షల సంపద ఇచ్చింది ఆ ఇళ్లు. అదేలా అనుకుంటున్నారా.. ఇళ్లు కూలిస్తే గోడల్లో బంగారు నాణేలు బయపడ్డాయి. అవి కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 600 నాణేలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని బ్రిటానీలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫిరంగీలను దాచడానికి లీజుకు తీసుకున్న ఇళ్లు మున్సిపాలిటీ అధికారులు కూల్చారు.

కూల్చే క్రమంలో గోడల్లో కొన్ని బంగారు నాణేలను అధికారులు గుర్తించారు. దీంతో ఆ గోడను పూర్తిగా కూల్చగా దాదాపు 600 బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని పురావస్తు శాఖ అధికారులకు అందించారు. అవి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన నాణేలుగా గుర్తించారు.

ఆ నాణేలపై బెల్జియన్‌ రాజు లియోపోల్డ్‌-2 బొమ్మ ముంద్రించి ఉంది. దీంతో ఆ నాణేలు 1865-1909వ సంవతర్సం నాటివిగా గుర్తించారు. వెలికితీసిన 600 నాణేల విలువ దాదాపు లక్ష యూరోలతో సమానమని అధికారులు తెలిపారు. కాగా ఫ్రెంచ్‌ చట్టం ప్రకారం నిధి మొత్తాన్ని కనుగొన్నవారికి సగం,ఇంటి యాజమాన్యులకు సగం ఇవ్వాలని ఉంది. దీంతో యాజమానికి 50శాతం రానుంది. కాగా ఇంటియాజమాని మాట్లాడుతూ.. బంగారు నాణేలను చూసి తానేమి ఆశ్చర్యానికి లోనుకాలేదన్నారు. తమ తాతగారు నాణేలు సేకరించేవారని పేర్కొన్నారు.  

👉Photo Credit : www.bptrends.com

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top