కరోనా చికిత్సపై కొత్త ఆశలు

Coronavirus: New Hope For Plasma Therapy Treatment - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌తో బాధ పడుతున్న వారిలో ఐదు వేల మంది రోగులకు ఇంతవరకు ‘ప్లాస్మా చికిత్స’  అందజేశారు. వారిలో 15 శాతం మంది మరణించగా, ఒక శాతం మందిలో మాత్రమే ఇన్‌ఫెక్షన్లు వచ్చాయని, మిగతా వారంతా కోలుకున్నారని ఓ వైద్య నివేదిక వెల్లడించింది. కరోన వైరస్‌ బారినపడి బతికి బయటక పడిన వారి రక్తంలోని ప్లాస్మాను తీసుకొని ఇతర కరోనా రోగులకు ఎక్కించడమే ‘ప్లాస్మా చికిత్స’  అంటారన్న విషయం తెల్సిందే. రక్తంలోని ప్లాస్మాలోనే యాండీ బాడీస్‌ అంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది. (కరోనాకు కొత్త రకం వ్యాక్సిన్)

ఈ రకమైన చికిత్సకు అమెరికా ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ (ఎఫ్‌డీఏ)’ గత మార్చి నెలలోనే అనుమతి ఇచ్చింది. దాంతో మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ, జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ మయో క్లినిక్‌ పరిశోధకులు ప్లాస్మా థెరపీని ప్రారభించి ఇప్పటి వరకు ఐదు వేల మందికి చికిత్సను అందజేశారు. 15 శాతం మృతులు, ఒక్క శాతం మాత్రమే ఇన్‌ఫెక్షన్లు ఉన్నందున ఈ ప్లాస్మా చికిత్స ఆశాజనకంగానే ఉందని పరిశోధకులు తెలిపారు. (మాస్క్‌‌ ధరించడంబలహీనతకు సంకేతం’!)

అందరికి కాకపోయిన ఆస్పత్రులో చేరిన కరోన రోగులందరికి ఈ చికిత్సను కొనసాగించవచ్చని వారు సూచించారు. అప్పుడే ఓ నిర్ణయానికి రావడం మంచిదికాదని, చనిపోయిన 15 శాతం కేసులను ఒక్కొక్క కేసు చొప్పున సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అమెరికా వైద్యాధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ప్లాస్మా చికిత్సపై కొత్త ఆశలు చిగురించాయని చెప్పవచ్చని వారు వ్యాఖ్యానించారు.  (ప్లాస్మా చికిత్స తీసుకున్న వైద్యుడు మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top