కరోనా కోసం కొత్తరకం మందు

Corona vaccine By Tablet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తోందని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ ఇమ్యూనాలోజిస్ట్‌ డాక్టర్‌ సియాన్‌ టకర్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. అందరు ఆశిస్తున్నట్లుగా ద్రవరూపంలో కాకుండా ట్యాబ్లెట్‌ రూపంలో తీసుకొస్తున్నట్లు కాలిఫోర్నియాలో సొంతంగా బయోటిక్‌ కంపెనీని నడుపుతున్న డాక్టర్‌ సియాన్‌ చెప్పారు. ఆయన బయోటెక్‌ కంపెనీ రాబిస్‌ లాంటి ఎన్నో జబ్బులకు రసాయనిక చర్యల ద్వారా వ్యాక్సిన్లను కనుగొన్నది. కరోనాకు సంబంధించి ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయని, జూలై నెలలో మనుషులపై ప్రయోగాలు నిర్వహించడంతోపాటు అదే సమయంలో వ్యాక్సిన్‌ ట్యాబ్లెట్ల ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరికల్లా కోట్లలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని డాక్టర్‌ సియాన్‌ చెప్పారు. (అడ్వకేట్ల డ్రస్కోడ్ మారింది, ఇకపై వారు...)

కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ఎనిమిది మంది నిపుణులతో కూడిన తన బందం జనవరి నెల నుంచి ఆఫ్‌లు కూడా తీసుకోకుండా వారానికి ఏడు రోజులు పని చేస్తూ వస్తోందని ఆయన తెలిపారు. తమ వ్యాక్సిన్‌ ఫార్మలాను ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం తమకు లేదని, వ్యాక్సిన్‌ వల్ల వచ్చే డబ్బు ప్రభుత్వానికి వెళ్లడం తమకిష్టం లేదని డాక్టర్‌ సియాన్‌ చెప్పారు. తమ వ్యాక్సిన్‌ ట్యాబ్లెట్‌ మనిషి చిన్న పేగులోకి వెళ్లాక పని చేయడం ప్రారంభిస్తుందని, అక్కడ వైరస్‌ యాంటీ బాడీలను సష్టించి రక్తంలోకి పంపుతుందని, రక్తంలో కలిసిన యాంటీ బాడీస్‌ శరీరమంతా రక్తంతోపాటు ప్రయాణిస్తూ కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేస్తోందని ఆయన వివరించారు. (లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవేనా..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top