కరోనా వైరస్‌తో అంతా ఖాళీ!

Coronavirus Effect: Chinese District Almost Empty - Sakshi

లండన్‌లోని చైనా టౌన్‌ (చైనీస్‌ డిస్ట్రిక్ట్‌ అని కూడా పిలుస్తారు) గురువారం రాత్రికి రాత్రి ఖాళీ అయిపోయింది. మనుష్య సంచారం లేక వీధులు, కస్టమర్లు కానరాక హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. లండన్‌లో ఓ మహిళకు కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఉన్నట్లు బుధవారం నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టం అవుతోంది. లండన్‌లో అదే తొలి కేసుకాగా, బ్రిటన్‌ దేశమంతా కలిసి తొమ్మిది కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన బాధితురాలిని దక్షిణ లండన్‌లోని గయ్య్‌ అండ్‌ సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.(కరోనా పేషెంట్‌ను కాల్చి చంపిన ఉత్తర కొరియా!)


గురువారం ఒక్క రోజే 763 మంది బ్రిటిషర్లకు వైద్య పరీక్షలు నిర్వహించగా అదష్టవశాత్తు ఎవరికీ వైరస్‌ సోకలేదని తేలింది. అయినప్పటికీ ప్రజలు, ముఖ్యంగా చైనా టౌన్‌లో ఇళ్లు కదలడం లేదు. ముఖ్యంగా జనాలు గుంపుగా ఉండే హోటళ్లు, షాపులు, ఇతర పబ్లిక్‌ స్థలాల్లోని అసలు వెళ్లడం లేదట. ఇప్పటి వరకు చైనాలో కరోనావైరస్‌ సోకిన రోగుల సంఖ్య 59,823 కేసులు నమోదుకాగా, చైనాను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 60, 394 కేసులు నమోదయ్యాయి. ఒక్క చైనాలోనే 1367 మంది మరణించగా, ప్రపంచ వ్యాప్తంగా ముగ్గురే మరణించారు.(‘కరోనా’తో పాటు అన్ని వైరస్‌లకు ఒకే టీకా!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top