‘కరోనా వైరస్‌’ కేసులు ఇంకా ఎక్కువే!

Corona Virus Cases Worse Than Feared In China - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ‘కరోనావైరస్‌’ మనం భయపడుతున్న దానికన్నా ప్రమాదకారని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులకన్నా పదిశాతం లేదా అంతకన్నా ఎక్కువ మంది ఈపాటికి వైరస్‌ బారిన పడి ఉంటారని ప్రముఖ బ్రిటీష్‌ శాస్త్రవేత్త, ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’ ప్రొఫెసర్‌ జాన్‌ ఎడ్ముండ్స్‌ హెచ్చరిస్తున్నారు. చైనాలో శుక్రవారం నాటికి కరోనావైరస్‌ వల్ల 638 మంది మరణించగా, 31,211 మంది వైరస్‌ బారిన పడ్డారు. ప్రపంచంలోని 27 దేశాల్లో 320 వైరస్‌ కేసులు నమోదయ్యాయి.

బ్రిటన్‌లో ఇప్పటికే మూడు కరోనావైరస్‌ కేసులు నమోదుకాగా, వచ్చే వారం నుంచి రోజుకు వెయ్యి మందికి చొప్పున వైరస్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇంగ్లండ్‌ ప్రభుత్వ వైద్య శాక వెల్లడించింది. ప్రస్తుతం లండన్‌లోని ల్యాబ్‌లో రోజుకు వంద మందికి చొప్పున వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలుత ఈ వైరస్‌ లక్షణాలు తీవ్రంగా ఉండవుకనుక దీన్ని ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తారని, చివరి నిమిషాల్లో పరీక్షలు చేయించుకున్నా పెద్దగా ఫలితం  ఉండదని ప్రొఫెసర్‌ జాన్‌ ఎడ్ముండ్స్‌ చెప్పారు. మరోవైపు తొలి రోజుల్లోలాగా ఇప్పుడు కరోనావైరస్‌ అంత వేగంగా ఇతరులకు విస్తరించక పోవడం మంచి వార్తని ఇతర వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top