రైలు ప్రమాదంలో నలుగురి మృతి

A commuter train has derailed..four dead - Sakshi

మిలాన్‌ : ప్రయాణికులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇటలీ దేశం మిలాన్‌ నగరంలోని పియోల్‌టెల్లో స్టేషన్‌ వద్ద ఉదయం 7 గంటలకు(అక్కడి కాలమానం ప్రకారం) చోటుచేసుకుంది. రైలు వేరొక పట్టాల మార్గంలోకి మారుతున్నపుడు ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రైలులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైలు పోర్టాగారిబల్ది స్టేషన్‌ నుంచి క్రెమోనా స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే ముందు రైలు  వణికిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. రెండు బోగీలు ప్రమాదానికి గురయ్యాని, ప్రమాదానికి గల కారణాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని మిలాన్‌ పోలీస్‌ చీఫ్‌ మార్సెల్లో కార్డోనా తెలిపారు.

ఇటలీలో ఘోర రైలు ప్రమాదాలు:
జూలై, 2016: పుగ్లియాలో రెండు రైళ్లు ఢీ..23 మంది మృతి
నవంబర్‌, 2012: కాలబ్రియాలో రైలు, వ్యానును ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి
జూన్‌, 2009: వయారెగ్గియోలో లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌తో వెళ్తున్న రైలు పట్టాలు తప్పి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు.
జనవరి, 2005: క్రెవాల్‌కోర్‌లో ప్యాసింబర్‌, గూడ్స్‌ రైళ్లు పరస్పరం ఢీ..17 మంది మృతి
జూలై, 2002: రోమెట్టా మెస్సినాలో పట్టాలు తప్పిన రైలు..8 మంది మృతి
ఏప్రిల్‌, 1978: రావైన్‌లో రెండు రైళ్లు ఢీ..42 మంది మృతి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top