జలుబు మంచిదే..!

Cold is also Helpful to Human - Sakshi

ఇప్పటివరకు మందు కనిపెట్టని వ్యాధి ఏంటి అంటే చాలా మంది ఎయిడ్స్‌ అనో.. కేన్సర్‌.. ఎబోలా అనో చెబుతారు. కానీ అదేదో రుషి అనే సినిమాలో ఓ డాక్టర్‌ చెప్పే సమాధానం ఏంటో తెలుసా.. జలుబు..! నిజమే జలుబుకు ఇప్పటివరకు ఎలాంటి మందు కనిపెట్టలేదు. అందరూ అంటుంటారు కూడా.. జలుబు మందులు వేసుకుంటే వారంలో తగ్గుతుంది.. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది అని. అయితే ఇదంతా ఎందుకంటే జలుబు మంచిదే అంటున్నారు కొందరు పరిశోధకులు. అదెలా అంటే.. జలుబుకు కారణమయ్యే వైరస్‌.. మూత్రాశయ కేన్సర్‌ను తగ్గిస్తుందట. కేన్సర్‌ కణాలకు ఈ వైరస్‌ సోకి వాటిని చంపేస్తుందట. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సర్రేకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతున్నారు.

ఈ పరిశోధనల ద్వారా మూత్రాశయ కేన్సర్‌కు సరికొత్త చికిత్స అందుబాటులోకి రానుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాక్స్‌సాకీవైరస్‌ (సీవీఏ21) మూత్రాశయ కేన్సర్‌ సోకిన 15 మందికి కణతులను తొలగించే శస్త్రచికిత్సకు వారం రోజుల మందు మూత్రాశయంలోకి ఎక్కించారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కేన్సర్‌ కణాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఈ వైరస్‌ కేన్సర్‌ కణాలకు సోకి వాటిని నాశనం చేశాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఒక్కరిలో కేన్సర్‌ కణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయని చెబుతున్నారు. మరో 14 మందిలో కేన్సర్‌ కణాలు చనిపోతున్నట్లు తేలింది. బ్రిటన్‌లో మూత్రాశయ కేన్సర్‌ ఏటా 10 వేల మందికి సోకుతుందట. అయితే దీని చికిత్సకు వాడే మందుల వల్ల చాలా సైడ్‌ ఎఫెక్ట్‌లు వస్తాయట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top