పట్టు సడలిస్తున్న చైనా! | Sakshi
Sakshi News home page

పట్టు సడలిస్తున్న చైనా!

Published Thu, Jul 27 2017 9:50 AM

పట్టు సడలిస్తున్న చైనా!

బీజింగ్‌: డోకాలమ్‌ విషయంలో పట్టువిడుపుల దిశగా చైనా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో భారత్‌ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ ధోవల్‌ చైనా రాయబారులతో సమావేశం కానున్నారు. గురువారం బ్రిక్స్‌ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత భద్రతా విషయాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పలువురు నాయకులను కలుస్తారు.

అయితే, జిన్‌పింగ్‌తో జరిగే సమావేశానికి మిగతా బ్రిక్స్‌ దేశాల భద్రతా సలహాదారులు కూడా హాజరవుతారు. డోకాలమ్‌లో ఉద్రిక్తతలపై చైనా స్టేట్‌ కౌన్సిలర్‌, సరిహద్దు భద్రతా సలహాదారు యాంగ్‌ జీచీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ధోవల్‌ పర్యటన సందర్భంగా చైనా మీడియా ప్రధానమంత్రి మోదీని పొగుడుతూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేసింది.

మోదీ ఆర్థిక ప్రగతిశీలురని, ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు వర్ధిల్లాలని జిన్హువా న్యూస్‌ పేర్కొంది. తమ వస్తువులకు కీలకమార్కెట్‌గా ఉన్న భారత్‌తో గొడవపడేందుకు చైనా అధిష్టానం సుముఖంగా లేకపోవడంతోనే ఆ దేశ మీడియా రూటు మార్చినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement