చందమామకు బహుమతులు.. | Carnegie Mellon University maufactur robos which carries gifts for moon | Sakshi
Sakshi News home page

చందమామకు బహుమతులు..

Jul 6 2015 9:17 AM | Updated on Sep 3 2017 5:01 AM

చందమామకు బహుమతులు..

చందమామకు బహుమతులు..

అందాల చందమామపైకి బహుమతులను తీసుకెళ్లే రోబోను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు.

వాషింగ్టన్: అందాల చందమామపైకి బహుమతులను తీసుకెళ్లే రోబోను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. భూమిపై నుంచి అతి తక్కువ బరువుతో వీటిని చంద్రమండలంపైకి చేర్చేలా రూపొందిస్తున్నారు. భూమిపై ప్రసిద్ధి గాంచిన కళ, కవిత్వం, సంగీతం, డ్రామా, నృత్యాలను చిన్నపాటి డిస్కుల్లో బంధించి ఓ మూన్ రోవర్‌తో వచ్చే ఏడాదిలో పంపేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సర్వం సిద్ధం చేస్తోంది.

 

అమెరికాలోని కార్నిగె మిలన్ విశ్వవిద్యాలయం, రోబోటిక్స్ సంస్థ ఈ ప్రక్రియను చేపట్టింది. ప్రయివేటు నిధులతో గూగుల్ లునార్ ఎక్స్‌ప్రైజ్, యూఎస్‌డీ 30 మిలియన్ కాంటెస్ట్‌ను తయారు చేస్తోంది. చంద్రుడిపైకి చిన్నసైజు డిస్కులతోపాటు, డేటా తీసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు టెక్‌టైమ్స్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement