బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీతో గండం గడిచింది!

Breast Implant Save Woman Life From Gunshot In Canada - Sakshi

చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోవ‌డం అంటే ఇదేనేమో..! గుండెకు దగ్గ‌ర‌గా తూటా వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమె బ‌తికి బ‌ట్ట‌గ‌ట్టింది. కార‌ణం ఆమె చేయించుకున్న‌ "బ్రెస్ట్ ఇంప్లాంట్"‌. ఈ అరుదైన ఘ‌ట‌న కెన‌డాలో చోటు చేసుకుంది. సేజ్‌ (ఎస్‌ఏజీఈ) మెడిక‌ల్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం.. 2018లో కెన‌డాలోని టోరంటోకు చెందిన మ‌హిళ‌పై కొంద‌రు కాల్పులు జ‌రిపారు. అందులో ఓ బుల్లెట్‌ నేరుగా గుండెమీద‌కు గురి పెట్టిన‌ప్ప‌టికీ అది ఎడ‌మ‌వైపు వ‌క్షోజం నుంచి కుడి వ‌క్షోజానికి తాకింది. కానీ గుండెలోకి వెళ్ల‌కుండా ప‌క్క నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌పడింది. అయితే బుల్లెట్ అలా ప‌క్క‌కు త‌ప్పుకోడానికి కార‌ణ‌మేంట‌ని లోతుగా ప‌రిశీలించ‌గా ఆమె వ‌క్షోజాలే ఆమెను కాపాడాయ‌ని తెలుసుకుని వైద్యులు ఆశ్చ‌ర్య‌పోయారు. (వైరల్‌ వీడియో: ఇలాంటి వ్యక్తిని మీరు చూశారా!)

కాక‌పోతే ఆమె వక్షోజాలు స‌హ‌జ‌మైన‌వి కావు. అందంగా, ఎత్తుగా క‌నిపించేందుకు సిలికాన్ బెలూన్లు అమ‌ర్చుకుంది. దీన్నే "బ్రెస్ట్ ఇంప్లాంట్" స‌ర్జ‌రీ అంటారు. అయితే ఇలా సిలికాన్ బెలూన్లు మ‌హిళ ప్రాణాల‌ను కాపాడ‌టం ఇదే తొలిసార‌ని వైద్యులు పేర్కొంటున్నారు. ఇవి బుల్లెట్ దిశ‌ను మార్చివేయ‌డాన్ని అరుదైన ఘ‌ట‌న‌గా అభివ‌ర్ణిస్తున్నారు. ఈ ఘటనలో ఆమె ప‌క్క‌టెముక‌లు విరిగాయ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు బుల్లెట్ దాడికి సిలికాన్ ఇంప్లాంట్ దెబ్బ‌తిన్నందున‌ వాటిని తీసివేశామ‌ని తెలిపారు. కాగా అమెరికాలో రెండు ర‌కాల బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక‌టి అవ‌త‌లి పొర సిలికాన్‌తో, మరొక‌టి సెలైన్‌తో నిండి ఉంటుంది. ఇవి వివిధ సైజుల్లో, వివిధ ఆకారాల్లో ల‌భిస్తాయి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎంద‌రో న‌టీమ‌ణులు బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసు‌కున్న విష‌యం తెలిసిందే. (రొమ్ము క్యాన్సర్ తొలి దశలో)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top