బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా జాయర్‌ బోసానారు | Brazil elects Bolsonaro for President | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా జాయర్‌ బోసానారు

Oct 30 2018 3:50 AM | Updated on Oct 30 2018 3:50 AM

Brazil elects Bolsonaro for President - Sakshi

జాయర్‌ బోసా నారు

సావోపౌలో: సంప్రదాయ ఫాసిస్ట్‌ నాయకుడు జాయర్‌ బోసా నారు(63) బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్‌ కూటమికి చెందిన వర్కర్స్‌ పార్టీ నాయకుడు ఫెర్నాండో హాడడ్‌పై ఆయన సంపూర్ణ మెజారిటీ సాధించారు. బోసానారుకు 55.2 శాతం ఓట్లు రాగా, ఫెర్నాండోకు 44.8 శాతం ఓట్లు దక్కాయి. గతంలో సైనికాధికారిగా పనిచేసిన బోసానారు ఎన్నికల ప్రచార సమయంలో తరచూ మహిళలు, గేలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ‘బ్రెజిల్‌ ట్రంప్‌’గా పేరొందారు. గత నాలుగు సార్లు లెఫ్ట్‌ పార్టీకి పట్టంకట్టిన బ్రెజిల్‌ ప్రజలు..మార్పు కోసం ఈసారి బోసానారుకు అధికారం అప్పగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బోసానారు గెలుపుపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజ్యాంగం, వైవిధ్యం, భిన్నత్వం పరిరక్షించి ప్రజలను ఏకంచేస్తానని ఆయన తన తొలి సందేశంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement