ఇరాక్‌లో 71 మంది జలసమాధి | Boat Sinks In Iraq, Killing At Least 100 During New Year Celebration | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో 71 మంది జలసమాధి

Mar 22 2019 5:49 AM | Updated on Jul 29 2019 5:43 PM

Boat Sinks In Iraq, Killing At Least 100 During New Year Celebration - Sakshi

మోసుల్‌: ఇరాక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మోసుల్‌ నగరంలో టైగ్రిస్‌ నదిపై వెళుతున్న ఓ నౌక గురువారం నదీ ప్రవాహానికి పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 19 మంది చిన్నారులు సహా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 55 మంది ప్రయాణికులను అధికారులు రక్షించారు. ఈ విషయమై ఇరాక్‌ ఆరోగ్యశాఖ మంత్రి సయిఫ్‌–అల్‌–బదర్‌  మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో నౌకలో 150 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఇది నౌక సామర్థ్యం కంటే రెట్టింపన్నారు. కుర్దుల నూతన సంవత్సరాది నౌరోజ్‌ సందర్భంగా వీరంతా మోసుల్‌ నుంచి ఉమ్‌–అల్‌–రబీన్‌ అనే పర్యాటక దీవికి బయలుదేరారని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement