ఆ వజ్రం వెల.. రూ. 284 కోట్లు | 'Blue Moon' Diamond Fetches Record 43 Million dollars at Auction | Sakshi
Sakshi News home page

ఆ వజ్రం వెల.. రూ. 284 కోట్లు

Nov 12 2015 9:07 AM | Updated on Sep 3 2017 12:23 PM

ఆ వజ్రం వెల.. రూ. 284 కోట్లు

ఆ వజ్రం వెల.. రూ. 284 కోట్లు

అది చాలా అరుదైన 12.03 క్యారెట్ల వజ్రం. దాని పేరు 'బ్లూ మూన్'. జెనీవాలోని సోత్‌బీ వేలం శాలలో దీన్ని వేలానికి పెట్టగా.. ఏకంగా రూ. 284 కోట్ల ధర పలికింది.

అది చాలా అరుదైన 12.03 క్యారెట్ల వజ్రం. దాని పేరు 'బ్లూ మూన్'. జెనీవాలోని సోత్‌బీ వేలం శాలలో దీన్ని వేలానికి పెట్టగా.. ఏకంగా రూ. 284 కోట్ల ధర పలికింది. ఈ విషయాన్ని సోత్‌బీ ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యారట్ వారీగా చూసుకుంటే వజ్రాలకు ఇప్పటివరకు పలికిన అత్యంత ఎక్కువ ధర ఇదేనని చెబుతున్నారు.

ఒక్క లోపం కూడా లేని ఈ వజ్రానికి ఇంత ధర రావడం సహజమేనని సోత్‌బీ అంతర్జాతీయ నగల విభాగం అధిపతి డేవిడ్ బెన్నెట్ అన్నారు. తాము మాత్రం దీనికి 231-363 కోట్ల మధ్యలో ఏదో ఒక ధర పలుకుతుందని అనుకున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement