శాంతి నోబెల్ నాకెందుకు ఇచ్చారో తెలీదు: ఒబామా | Barack Obama unsure of why he got Nobel Peace Prize | Sakshi
Sakshi News home page

శాంతి నోబెల్ నాకెందుకు ఇచ్చారో తెలీదు: ఒబామా

Oct 20 2016 2:40 AM | Updated on Apr 4 2019 3:25 PM

శాంతి నోబెల్ నాకెందుకు ఇచ్చారో తెలీదు: ఒబామా - Sakshi

శాంతి నోబెల్ నాకెందుకు ఇచ్చారో తెలీదు: ఒబామా

నోబెల్ శాంతి బహుమతిని తనకు ఎందుకిచ్చారో ఇప్పటికీ తెలీదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు.

వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిని తనకు ఎందుకిచ్చారో ఇప్పటికీ తెలీదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. ఒబామా 2008లో అధ్యక్షుడయ్యాక 2009లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 55ఏళ్ల ఒబామా, 2017 జనవరిలో శ్వేత సౌధాన్ని వీడనుండడం తెలిసిందే. ఈ నే పథ్యంలో ‘ద లేట్ షో’ అనే టీవీ షోలో ఆయన పాల్గొన్నారు.  ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థిలా ఒబామా నటించగా, ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగా వ్యాఖ్యాత  పలు ప్రశ్నలు అడిగారు. వీటికి ఒబామా ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఇక్కడే నోబెల్ గురించి ప్రస్తావించగా ఒబామా పై వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement