ఆస్ట్రియా యువ‌రాణి ఆక‌స్మిక మృతి | Austria Princess Maria Galitzine Passes Away On May 4 | Sakshi
Sakshi News home page

చెఫ్‌ను వివాహామాడిన యువరాణి మృతి

May 15 2020 1:53 PM | Updated on May 15 2020 3:24 PM

Austria Princess Maria Galitzine Passes Away On May 4 - Sakshi

టెక్సాస్ : భార‌త సంత‌తికి చెందిన చెఫ్‌ను పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువ‌రాణి మరియా గాలిట్జీన్ (31) మృతి చెందారు. ఆక‌స్మికంగా గుండెపోటు రావ‌డంతో హ్యూస్ట‌న్‌లో క‌న్నుమూశారు. అయితే మ‌రియా మ‌ర‌ణ‌ వార్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మే 4న మ‌రియా మృతి చెంద‌గా స్థానిక మీడియాలో వ‌చ్చిన సంతాప వార్త ఆధారంగా ప్ర‌పంచానికి ఆమె మ‌ర‌ణ వార్త తెలిసింది. 2017లో హ్యూస్ట‌న్‌లో న‌గ‌రంలో చెఫ్ రిషి రూప్ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. రిషి రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప‌నిచేస్తున్న హ్యూస్ట‌న్‌లోనే మ‌రియా ఇంటిరీయ‌ర్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. (ఇప్ప‌ట్లో స్కూళ్లు లేన‌ట్లే! కాలేజీల‌కు మాత్రం.. )

మరియా.. ప్రిన్సెస్ మరియా- అన్నా,ప్రిన్స్ పియోటర్ గాలిట్జీన్‌ కుమార్తె. 1988లో ల‌గ్జంబ‌ర్గ్‌లో జ‌న్మించారు. మ‌రియాకు ముగ్గురు సోద‌రీమ‌ణులు, ఒక సోద‌రుడు ఉన్నాడు. ఆమెకు అయిదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ర‌ష్యాకు మ‌కాం మార్చారు. అక్క‌డే గ్యాడ్యూయేష‌న్ పూర్తిచేసుకున్న మ‌రియా ఆర్ట్ ఆండ్ డిజైన్ కాలేజీలో చేరేందుకు బెల్జియంకు వెళ్లారు. బ్ర‌స్సెల్స్‌తోపాటు చికాగో, ఇల్లినాయిస్‌, హ్యూస్ట‌న్ వంటి న‌గ‌రాల‌లో ఆమె ప‌నిచేశారు. చిన్న వ‌య‌స్సులోనే మ‌రియా మ‌ర‌ణించ‌డంతో రాజ కుటంబీకులంతా సంతాపం ప్ర‌క‌టించారు. (ప్రముఖ హస్యనటుడి మృతి )

Advertisement
 
Advertisement
Advertisement