దించకుండా బీరు తాగిన ప్రధాని | Australia's Tony Abbott downs beer in 7 seconds | Sakshi
Sakshi News home page

దించకుండా బీరు తాగిన ప్రధాని

Apr 20 2015 8:49 AM | Updated on Sep 3 2017 12:35 AM

దించకుండా బీరు తాగిన ప్రధాని

దించకుండా బీరు తాగిన ప్రధాని

ప్రోత్సహించాలే కానీ ఏడు సెకండ్లలో కూడా బీరు దించకుండా తాగొచ్చని నిరూపించాడు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్.

సిడ్నీ: ప్రోత్సహించాలే కానీ ఏడు సెకండ్లలో కూడా బీరు దించకుండా తాగొచ్చని నిరూపించాడు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్. రూల్స్ ఫుట్ బాల్ ఆటగాళ్లు సిడ్ని పబ్ లో ఇచ్చిన విందులో అందరి హర్షధ్వానాల మధ్య టోనీ  గ్లాసు దించకుండా బీరు లాగించారు. జనాలతో కిక్కిరిసిన బార్ లో టోనీ గ్లాసుని  దించకుండా బీరుని తాగిన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. టోనీ చేసిన ఈ ప్రయత్నం కొందరికి ఆనందాన్నిస్తే మరికొందరికి చిరాకు తెప్పించింది. ఆస్ట్రేలియాలో అమితంగా మద్యం సేవిస్తున్నారని విమర్శించిన ప్రధానే ఇలా అందరి ముందు తాగడం ఏంటని.. చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement