తిమింగలాన్ని కాపాడిన వ్యక్తికి జరిమానా

Australian man fined to free a whale from nets - Sakshi

సిడ్నీ : సముద్రంలో వలలో చిక్కుకుపోయిన తిమింగలాన్ని కష్టపడి విడిపించిన వ్యక్తికి ఆస్ట్రేలియా అధికారులు జరిమానా విధించారు. గోల్డ్‌కోస్ట్‌లోని సముద్రపు నీటిలో మంగళవారం ఓ భారీ తిమింగలం వలలో చిక్కుకుపోయింది. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చినా వెంటనే ఎవరూ రాకపోవడంతో ఆ యువకుడు దాన్ని కాపాడటానికి ముందుకు వచ్చాడు. వెంటనే అక్కడికి తన బోటులో వెళ్లి, వలలో చిక్కుకుపోయిన తిమింగలాన్ని తన వద్ద ఉన్న కత్తి సహాయంతో విడిపించాడు. అయితే ఎంతో కష్టపడి దాన్ని విడిపిస్తే, ఒడ్డుకు రాగానే అధికారులు తనకు జరిమానా విధించారని ఆ యువకుడు వాపోయాడు. 

కౌన్సిల్‌ ఆస్తులకు నష్టం కలిగించినందుకు, తిమింగలానికి దగ్గరగా వెళ్లినందుకుగానూ క్వీన్స్‌లాండ్‌ స్టేట్‌ అధికారులు జరిమానా విధించినట్టు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియాలోని బీచ్‌ల చుట్టూరా వలలను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top