డ్రైవర్‌ లేని రైలు.. చివరికేమైందో తెలుసా?

In Australia Train Travels Without Driver For An Hour - Sakshi

డ్రైవర్‌ లేకుండా దాదాపు 110 కిలోమీటర్లు ప్రయాణించిన గూడ్స్‌ రైలు

సిడ్నీ : ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్తున్న ఓ భారీ గూడ్స్‌ రైలు బండి పట్టాలు తప్పింది. మైనింగ్‌ దిగ్గజం బీహెచ్‌పీ కంపెనీకి చెందిన గూడ్స్ రైలు డ్రైవర్‌ లేకుండా దాదాపు గంటసేపు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. బీహెచ్‌పీకి చెందిన 268 - వాగన్‌ రైలు ఇనుప ఖనిజాన్ని మోసుకుని పశ్చిమ ఆస్ట్రేలియాలోని పోర్ట్‌ హెడ్‌ల్యాండ్‌కు ప్రయాణం ప్రారంభించింది. ప్రయాణం మధ్యలో తనిఖీ చేయడం కోసం డ్రైవర్‌ తన క్యాబిన్‌ నుంచి దిగాడు.

ఈ సమయంలో రైలు ఆటోమెటిగ్గా పట్టాలు తప్పి.. గంట సేపు దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ కొన్ని రైళ్లు, 1,500 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నదని సమాచారం. ప్రస్తుతం బీహెచ్‌పీ సిబ్బంది ఈ ట్రాక్‌ను బాగు చేసే పనిలో ఉన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top