చిర్రెత్తిన షార్క్‌ చుక్కలు చూపించింది | australia shark attack on a diver.. he suffers 'eight hour' ordeal | Sakshi
Sakshi News home page

చిర్రెత్తిన షార్క్‌ చుక్కలు చూపించింది

Jan 23 2017 4:14 PM | Updated on Sep 5 2017 1:55 AM

చిర్రెత్తిన షార్క్‌ చుక్కలు చూపించింది

చిర్రెత్తిన షార్క్‌ చుక్కలు చూపించింది

ఓ ఆస్ట్రేలియన్‌ డైవర్‌కు ఓ భారీ రాకాసి షార్క్‌ చుక్కలు చూపించింది. వేటాడివేటాడి తీవ్రంగా గాయపరిచింది. ఏదోలా చావు నుంచి బయటపడిన అతడు మాత్రం దాదాపు ఎనిమిదిగంటలపాటు చావుకంటే నరకాన్ని అనుభవించాడు.

ఓ ఆస్ట్రేలియన్‌ డైవర్‌కు ఓ భారీ రాకాసి షార్క్‌ చుక్కలు చూపించింది. వేటాడివేటాడి తీవ్రంగా గాయపరిచింది. ఏదోలా చావు నుంచి బయటపడిన అతడు మాత్రం దాదాపు ఎనిమిదిగంటలపాటు చావుకంటే నరకాన్ని అనుభవించాడు. ఆ తర్వాతే అతడికి వైద్యం అందింది. క్వీన్స్‌లాండ్‌ తీరంలోని ఏజెన్సీ ప్రాంతంగా ఉండే గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌లో స్కూబాకు చెందిన డైవర్‌ ఓ మరబోటులో వెళ్లి సముద్రంలోకి దిగాడు. అనంతరం ప్రశాంతంగా నీటి అడుగుభాగంలోకి వెళ్లి ఈదుతున్నాడు.

దాదాపు 50 అడుగుల లోతుగా వెళ్లి ముందుకు వెళుతున్న సమయంలో అనూహ్యంగా వెనుక నుంచి అతడిపై షార్క్‌ దాడి చేసింది. అతడి చేతిని పలుమార్లుగట్టిగా కొరికింది. అలాగే కడుపులో కూడా గాయం చేసింది. వైద్య పరిభాషలో చెప్పాలంటే తీవ్ర ఆగ్రహావేశంతో అనుకొని మరి ఈ దాడిని షార్క్ చేసింది. దాదాపు ఎనిమిది చోట్ల గాయాలపాలయినప్పటికీ ఎంతో ధైర్యంగా ఈది తన మరబోటును చేరుకున్న అతడు బతుకు జీవుడా అని బోటులో పడ్డాడు. రక్తస్రావం తీవ్రంగా అవడంతోపాటు భారీ గాయాలతో దాదాపు 8గంటలపాటు నొప్పులు అనుభవించాడు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement