ఆ తిమింగలం మాంచి స్టిల్ ఇస్తే... | Australia: Humpback whale splashes Sydney tourists | Sakshi
Sakshi News home page

ఆ తిమింగలం మాంచి స్టిల్ ఇస్తే...

Jul 21 2016 3:20 AM | Updated on Sep 4 2017 5:29 AM

ఆ తిమింగలం మాంచి స్టిల్ ఇస్తే...

ఆ తిమింగలం మాంచి స్టిల్ ఇస్తే...

ఏమండీ.. మీకో విషయం చెబుతా.. మనం అడవికి వెళ్లాం.. పులిని ఓసారైనా దగ్గర నుంచి చూద్దామని.. మనం చూడాల్సిన పులి మన పక్కకే వచ్చింది..

ఏమండీ.. మీకో విషయం చెబుతా.. మనం అడవికి వెళ్లాం.. పులిని ఓసారైనా దగ్గర నుంచి చూద్దామని.. మనం చూడాల్సిన పులి మన పక్కకే వచ్చింది.. డ్యాన్సులేసింది.. వెళ్లిపోయింది.. మనం మాత్రం ఎటో దిక్కులు చూస్తూ.. ఇంతకీ పులెక్కడుందబ్బా అని బైనాక్యులర్ పెట్టుకుని మరీ వెతుకుతున్నాం..  ఇక్కడ సీన్ కూడా అలాంటిదే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొందరు పర్యాటకులు తిమింగలాన్ని చూద్దామని షిప్పేసుకుని బయలుదేరారు..
 
 ఫొటో చూశారుగా.. వారంతా ఎటో దిక్కులు చూస్తున్నారు.. ఇటు ఓ భారీ తిమింగలం మాంచి స్టిల్ ఇచ్చి వెళ్లిపోయింది. సీనంతా అయిపోయాక.. ఇంత భారీ శబ్దమొచ్చిందేంటబ్బా అంటూ అందరూ ఇటు లుక్కేసారట. ఈ చిత్రాన్ని వెనుకనే మరో బోటులో వస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement