డబ్బులు రాలేదు.. ఏటీఎం వచ్చేసింది.. | ATM it has not received the money | Sakshi
Sakshi News home page

డబ్బులు రాలేదు.. ఏటీఎం వచ్చేసింది..

Oct 23 2014 1:24 AM | Updated on Sep 2 2017 3:15 PM

డబ్బులు రాలేదు..  ఏటీఎం వచ్చేసింది..

డబ్బులు రాలేదు.. ఏటీఎం వచ్చేసింది..

ఏటీఎంకు వెళ్లాం.. డబ్బులు రాలేదు. ఏదో ప్రోబ్లం.. ఏం చేస్తాం? మరో ఏటీఎంకు వెళ్తాం..

ఏటీఎంకు వెళ్లాం.. డబ్బులు రాలేదు. ఏదో ప్రోబ్లం.. ఏం చేస్తాం? మరో ఏటీఎంకు వెళ్తాం.. అంతేగా.. మనమైతే అలాగే వెళ్తాం. ఈవిడ మాత్రం అలా కాదు. ఏటీఎం నుంచి డబ్బులు రాకపోయేసరికి.. తిక్కరేగి.. మొత్తం ఏటీఎంనే  ఊడబీకేసింది. ఈ నెల 16న చైనాలోని డాన్‌గువాన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఈ చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మహిళ డబ్బులు తీయడానికి చాలాసార్లు ప్రయత్నించినా.. రాలేదు. దీంతో ఆగ్రహం చెంది.. కేవలం తన చేతులతో మొత్తం మెషీన్‌నే పీకిపారేసింది. చుట్టుపక్కనున్న వాళ్లు నోరెళ్లబెడుతూ చూశారు..

మరికొందరు సీరియెస్‌గా తమ సెల్‌లో ఈ చిత్రాలు తీస్తూ బిజీగా గడిపారు. అక్కడే ముగ్గురు సెక్యూరిటీ గార్డులున్నా.. సీన్ చూసినట్లు చూస్తూ ఉండిపోయారు. చివరికి పోలీసులు వచ్చి.. ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎన్నిసార్లు డబ్బులు తీద్దామని యత్నిం చినా.. రాకపోయేసరికి ఇలా చేశానని ఆమె సంజాయిషీ ఇచ్చుకుంది. మరోవైపు ఇది పాత ఏటీఎం అని అందుకే ఈజీగా ఊడిపోయిందని బ్యాంకు అధికారులు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement