కంటి కదలికలు నువ్వేంటో చెప్పేస్తాయ్‌!

Artificial Intelligence To Know About Human Feelings - Sakshi

మెల్‌బోర్న్‌: కంటి కదలికలతో మన వ్యక్తిత్వాన్ని గుర్తించే కొత్త రకం కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. జర్మనీలోని స్టట్‌గార్ట్‌ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని ఫిండర్స్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో ఈ విషయాన్ని గుర్తించారు. స్టేట్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ ఉపయోగించి కంటి కదలికలకు, వ్యక్తిత్వానికి ఉన్న సంబంధాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు. యూనివర్సిటీ పరిధిలో 42 మందికి చెందిన కంటి కదలికల్ని కొన్ని రోజులపాటు అధ్యయనం చేసి, వారికి ఒక ప్రశ్నావళిని అందించి పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ ఫలితాల ప్రకారం కంటి కదలికల ద్వారా ఒకరి కలుపుగోలుతనం, ఆసక్తి, నిజాయితీ వంటి అంశాల్ని గుర్తించవచ్చు. మనిషి వ్యక్తిత్వాన్ని వివరించే లక్షణాల్లో మనస్సాక్షి, మానసిక సంబంధ విషయాలు, కలుపుగోలుతనం, అంగీకారయోగ్యం వంటి విషయాల్ని అల్గారిథమ్‌ సాఫ్ట్‌వేర్‌ వివరిస్తుంది. ఈ ఫలితాలు మనిషి, యంత్రాల మధ్య సంబంధాల్ని అభివృద్ధి చేసేందుకు తోడ్పడతాయని టోబియాస్‌ లోట్షెర్‌ అనే పరిశోధకుడు అన్నాడు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top