దేవతా గొడుగు.. | Angel umbrella | Sakshi
Sakshi News home page

దేవతా గొడుగు..

Oct 19 2014 1:56 AM | Updated on Sep 2 2017 3:03 PM

దేవతా గొడుగు..

దేవతా గొడుగు..

ఇది గొడుగు. అవును గొడుగే. చూస్తే.. టార్చ్‌లైట్‌లా కనిపిస్తోంది గానీ.. ఇది గొడుగే.. అయితే..

ఇది గొడుగు. అవును గొడుగే. చూస్తే.. టార్చ్‌లైట్‌లా కనిపిస్తోంది గానీ.. ఇది గొడుగే.. అయితే.. దేవతా వస్త్రాలు టైపు గొడుగన్నమాట. వర్షం పడినప్పుడు ఈ ఫొటోలో చూపినట్లు ఆ ప్లాస్టిక్ గొట్టాన్ని పట్టుకుంటే చాలు.. తడిచే ప్రసక్తే లేదు. చైనా నాన్‌జింగ్ వర్సిటీ పరిశోధకులు ఈ ఎయిర్ అంబ్రెల్లాను రూపొందించారు. ఈ గొడుగు పై భాగంలో రంధ్రాలుంటాయి. స్విచ్చు నొక్కితే.. వాటిల్లోంచి వేగంగా గాలి వస్తుంది. ఆ గాలే ఛత్రంలా పనిచేస్తుందన్నమాట. నీళ్లు మనమీద పడకుండా ఆ గాలి వాటిని పక్కకు తోసేస్తుంది.

దీన్లోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే.. 30 నిమిషాలు పనిచేస్తుంది. ఈ ప్లాస్టిక్ గొట్టం పై భాగంలో మోటార్, మధ్య భాగంలో బ్యాటరీ, కింద భా గంలో స్విచ్చు ఉంటాయి. దీన్ని మరింత మెరుగుపరిచేం దుకు యత్నిస్తున్నారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ ఎయిర్ అంబ్రెల్లా ధర రూ.12,000 వరకూ ఉండొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement