దేవతా గొడుగు..
ఇది గొడుగు. అవును గొడుగే. చూస్తే.. టార్చ్లైట్లా కనిపిస్తోంది గానీ.. ఇది గొడుగే.. అయితే.. దేవతా వస్త్రాలు టైపు గొడుగన్నమాట. వర్షం పడినప్పుడు ఈ ఫొటోలో చూపినట్లు ఆ ప్లాస్టిక్ గొట్టాన్ని పట్టుకుంటే చాలు.. తడిచే ప్రసక్తే లేదు. చైనా నాన్జింగ్ వర్సిటీ పరిశోధకులు ఈ ఎయిర్ అంబ్రెల్లాను రూపొందించారు. ఈ గొడుగు పై భాగంలో రంధ్రాలుంటాయి. స్విచ్చు నొక్కితే.. వాటిల్లోంచి వేగంగా గాలి వస్తుంది. ఆ గాలే ఛత్రంలా పనిచేస్తుందన్నమాట. నీళ్లు మనమీద పడకుండా ఆ గాలి వాటిని పక్కకు తోసేస్తుంది.
దీన్లోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే.. 30 నిమిషాలు పనిచేస్తుంది. ఈ ప్లాస్టిక్ గొట్టం పై భాగంలో మోటార్, మధ్య భాగంలో బ్యాటరీ, కింద భా గంలో స్విచ్చు ఉంటాయి. దీన్ని మరింత మెరుగుపరిచేం దుకు యత్నిస్తున్నారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ ఎయిర్ అంబ్రెల్లా ధర రూ.12,000 వరకూ ఉండొచ్చు.