ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!! | The World's Most Expensive Umbrella Made By An Italian Company | Sakshi
Sakshi News home page

ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!!

Published Sun, Jun 16 2024 11:34 AM | Last Updated on Sun, Jun 16 2024 11:34 AM

The World's Most Expensive Umbrella Made By An Italian Company

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడుగు. పురుషుల ఫ్యాషన్‌ వస్తువులను తయారు చేసే ఇటాలియన్‌ కంపెనీ ‘బిలియనీర్‌ కూటూర్‌’ దీనిని ప్రత్యేకంగా మొసలి తోలుతో రూపొందించింది. దీనిని కొనుగోలు చేయాలంటే, ముందుగా ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ల ఒత్తిడి పెరిగితే, ఈ గొడుగు చేతికి అందడం కొంత ఆలస్యం కూడా కావచ్చు.

‘బిలియనీర్‌ కూటూర్‌’ తయారు చేసే విలాసవంతమైన వస్తువుల కోసం పోటీపడే అపర కుబేరులు ఈ గొడుగు కోసం కూడా పోటీ పడుతున్నారు. దీని ధర 50 వేల డాలర్లు (రూ.41.54 లక్షలు). అత్యంత ఖరీదైన గొడుగుల్లో ఇప్పటి వరకు ఈ మొసలి తోలు గొడుగుదే రికార్డు. ఫార్ములా వన్‌ రేసింగ్‌ దిగ్గజం ఫ్లావియో బ్రియాటోర్‌ వంటి అతి కొద్దిమంది అపర కుబేరులు మాత్రమే ఇప్పటి వరకు ఈ మొసలితోలు గొడుగును కొనుగోలు చేశారు.

ఇవి చదవండి: ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement