ఐఎస్ఐఎస్‌ అధినేత హతం | Abu Bakr al-Baghdadi killed in US led air strike | Sakshi
Sakshi News home page

ఐఎస్ఐఎస్‌ అధినేత హతం

Jun 14 2016 3:01 PM | Updated on Aug 24 2018 7:24 PM

ఐఎస్ఐఎస్‌ అధినేత హతం - Sakshi

ఐఎస్ఐఎస్‌ అధినేత హతం

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ అమెరికా నేతృత్వంలో జరిగిన వైమానిక దాడులలో హతమైనట్లు కథనాలు వస్తున్నాయి.

అబూబకర్ అల్ బాగ్దాదీ.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా అధినేత. ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించి, ప్రపంచం నలుమూలలా ఉగ్రవాద దాడులతో అల్లకల్లోలం సృష్టిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తాజాగా అమెరికా నేతృత్వంలో జరిగిన వైమానిక దాడులలో హతమైనట్లు కథనాలు వస్తున్నాయి.

ఐఎస్ఐఎస్ అనుబంధ అరబిక్ వార్తా సంస్థ అల్ అమాక్ ఈ విషయాన్ని తెలిపింది. అమెరికా సాగించిన వైమానిక దాడులలో అల్ బాగ్దాదీ మరణించాడని ఈ వార్తా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా గానీ, ఇతర అధికారిక వార్తా సంస్థలు గానీ ఏవీ నిర్ధారించలేదు. సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు తెలుస్తోంది. ఐఎస్ఐస్ ఆధీనంలో ఉన్న మోసుల్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement