ఒక లైక్‌ ఖరీదు.. రూ. 2.58 లక్షలు! | A like cost is Rs. 2.58 lakhs! | Sakshi
Sakshi News home page

ఒక లైక్‌ ఖరీదు.. రూ. 2.58 లక్షలు!

Jun 4 2017 4:28 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఒక లైక్‌ ఖరీదు.. రూ. 2.58 లక్షలు! - Sakshi

ఒక లైక్‌ ఖరీదు.. రూ. 2.58 లక్షలు!

మీకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా? అందులో వచ్చే అప్‌డేట్లకు లైకులు కొడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.

మీకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా? అందులో వచ్చే అప్‌డేట్లకు లైకులు కొడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కాస్తంత జాగ్రత్తగా చూసి అందులో కంటెంట్‌ ఏముందో చూసుకుని మరీ లైక్‌ కొట్టండి. లేకపోతే మీరు కూడా భారీ మొత్తంలో జరిమానా కట్టుకోవాల్సి ఉంటుంది. వేలు ఉంది కదా, దాంతో టచ్‌ చేస్తే చాలు లైక్, లవ్‌ లాంటి బటన్లు యాక్టివేట్‌ అవుతాయని అనుకోకండి. స్విట్జర్లాండ్‌లో ఇలాగే లైక్‌ కొట్టినందుకు ఓ వ్యక్తి ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది.

పరువు నష్టం కలిగించేవిగా ఉన్న వ్యాఖ్యలకు లైక్‌ కొట్టినందుకు జడ్జి అంత మొత్తంలో జరిమానా విధించారు. ఎర్విన్‌ కెస్లర్‌ అనే వ్యక్తి జంతువుల హక్కుల గ్రూపు నడిపిస్తుంటారు. ఆయన చేసిన పోస్టుల మీద కొంతమంది వివక్షాపూరితమైన కామెంట్లు చేస్తారు. అలాంటి వ్యాఖ్యల మీద ఓ వ్యక్తి లైక్‌ కొట్టినందుకు జడ్జికి అతడి మీద కోపం వచ్చింది. లైక్‌ చేయడం ద్వారా ఆ వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్థించినట్లు అయిందని జడ్జి తన తీర్పులో వెల్లడించారు. ఆ చర్చల్లో పాల్గొన్న చాలామంది మీద కెస్లర్‌ దావాలు వేశారు. కెస్లర్‌ గురించి వ్యాఖ్యలు చేసిన కొంతమందికి  కోరు ్టకూడా దోషులుగా నిర్ణయించింది. 

Advertisement
 
Advertisement
Advertisement