డిఫాల్టర్లకు చైనా ప్రభుత్వం చుక్కలు!

 9 million loan defaulters blacklisted in China - Sakshi

బీజింగ్‌: ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికే భారత్‌లో నానా కష్టాలు పడుతుంటే చైనా ప్రభుత్వం అక్కడి డిఫాల్టర్లకు చుక్కలు చూపిస్తోంది. 2017 చివరినాటికి రుణాల ఎగవేతకు పాల్పడిన 95.9 లక్షల మంది ప్రజల్ని కోర్టులు నిషేధిత జాబితాలో చేర్చినట్లు సుప్రీం పీపుల్స్‌ కోర్టు(ఎస్పీసీ) తెలిపింది.  డిఫాల్టర్ల రూ.1.76 లక్షల కోట్ల(27.7 బిలియన్‌ డాలర్లు) డిపాజిట్లను జప్తు చేశారు.

పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డుల ఆధారంగా విమానాలు, హైస్పీడ్‌ రైళ్లలో టికెట్లు కొనకుండా అడ్డుకున్నారు. డిఫాల్టర్లు దాఖలు చేసే రుణ, క్రెడిట్‌ కార్డ్‌ దరఖాస్తుల్ని తిరస్కరించేందుకు బ్యాంకులతో కలిసి పనిచేశారు. నిషేధిత జాబితాలోని వ్యక్తులు కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులుగా ఇకపై ఉండలేరు.

Back to Top