బోట్‌ మునిగి 9మంది మృతి,30మంది గల్లంతు | 9 dead in Colombia boat capsize | Sakshi
Sakshi News home page

కొలంబియాలో విషాదం

Jun 26 2017 9:56 AM | Updated on Sep 5 2017 2:31 PM

కొలంబియాలో ఓ టూరిస్ట్‌ బోట్‌ మునిగి తొమ్మిది మంది మృతి చెందారు.

బొగొటా:  కొలంబియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్ట్‌ బోట్‌ మునిగి తొమ్మిది మంది మృతి చెందగా, మరో 30మందికి పైగా గల్లంతు అయ్యారు. బోట్‌లో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిటిష్‌ కొలంబియా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న చిన్న బోట్లు మరో పెద్ద బోటు త్వరితగతిన ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని 100మందికి పైగా సురక్షితంగా రక్షించారు. దాదాపు 20 మందికి పైగా బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
 
మెడెల్లిన్ కు 45 కిలోమీటర్ల దూరంలో తూర్పుగా ఉన్న గుటాపె సమీపంలోని  కోస్తా తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెస్క్యూ టీమ్‌తో పాటు, కొలంబియన్‌ వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టి బాధితులను అక్కడ నుంచి తరలిస్తున్నారు. అయితే బోట్‌లో ఎలాంటి లైఫ్‌ జాకెట్లు లేవని, బోటు ఐదు నిమిషాల వ్యవధిలోనే మునిగిపోయిందని  ప్రాణాలతో బయటపడ్డ ఓ టూరిస్ట్‌ తెలిపాడు.  కాగా ప్రమాదానికి ముందు బోట్‌ ఒక భాగం నీటిలో మునిగిపోయినట్లు సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement