breaking news
Colombia boat capsize
-
పడవ మునక: 30 మంది గల్లంతు
బొగొటా: కొలంబియాలో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా 30 మంది గల్లంతయ్యారు. గ్వాటపే పట్టణం సమీపంలోని ఎల్ పెనాల్ రిజర్వాయర్‌లో ఆదివారం 150 మంది పర్యాటకులతో కూడిన పడవ బయలు దేరింది. పడవ జలాశయం మధ్యలో ఉండగా అకస్మాత్తుగా నీట మునిగిపోయింది. పర్యాటకుల కేకలతో ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించారు. 100 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే, ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలు వెలికి తీశామని, సుమారు 30 మంది జాడ తెలియకుండా పోయిందని పోలీసు అధికారులు తెలిపారు. కనిపించకుండాపోయిన వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
బోట్ మునిగి 9మంది మృతి,30మంది గల్లంతు
బొగొటా: కొలంబియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్ట్ బోట్ మునిగి తొమ్మిది మంది మృతి చెందగా, మరో 30మందికి పైగా గల్లంతు అయ్యారు. బోట్లో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిటిష్ కొలంబియా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న చిన్న బోట్లు మరో పెద్ద బోటు త్వరితగతిన ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని 100మందికి పైగా సురక్షితంగా రక్షించారు. దాదాపు 20 మందికి పైగా బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మెడెల్లిన్ కు 45 కిలోమీటర్ల దూరంలో తూర్పుగా ఉన్న గుటాపె సమీపంలోని కోస్తా తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెస్క్యూ టీమ్‌తో పాటు, కొలంబియన్ వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టి బాధితులను అక్కడ నుంచి తరలిస్తున్నారు. అయితే బోట్లో ఎలాంటి లైఫ్ జాకెట్లు లేవని, బోటు ఐదు నిమిషాల వ్యవధిలోనే మునిగిపోయిందని ప్రాణాలతో బయటపడ్డ ఓ టూరిస్ట్ తెలిపాడు. కాగా ప్రమాదానికి ముందు బోట్ ఒక భాగం నీటిలో మునిగిపోయినట్లు సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.