బ్రెజిల్‌ స్కూల్లో కాల్పులు.. 8 మంది మృతి

8 killed in Brazil school - Sakshi

సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో నగర శివార్లలోని ఓ పాఠశాలలోకి బుధవారం ఇద్దరు దుండగులు ప్రవేశించి కాల్పులు జరిపి 6 మందిని పొట్టనబెట్టుకున్నారు. దుండగులిద్దరూ కౌమార దశలో ఉన్నవారని అధికారులు చెప్పారు. కాల్పులు జరిపిన అనంతరం వారే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నామన్నారు. సంఘటన స్థలంలో ఐదుగురు చిన్నారులు, ఓ టీచర్, ఇద్దరు దుండగులు సహా మొత్తం 8 మృతదేహాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారని బ్రెజిల్‌కు చెందిన ఓ వార్తా వెబ్‌సైట్‌ తెలిపింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top