కూలిన విమానం.. 8 మంది మృతి | 8 killed as military plane crashes near Colombia capital | Sakshi
Sakshi News home page

కూలిన విమానం.. 8 మంది మృతి

May 2 2017 9:24 AM | Updated on Sep 5 2017 10:13 AM

కూలిన విమానం.. 8 మంది మృతి

కూలిన విమానం.. 8 మంది మృతి

సైనిక విమానం కూలిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.

బొగోటా: కొలంబియాలో ఓ సైనిక విమానం ప్రమాదానికి గురైంది. మిలిటరీ బేస్‌ నుంచి బొగోటాకు బయలుదేరిన సెస్నా కరవాన్‌ అనే సింగిల్‌ ఇంజిన్‌ విమానం సెంట్రల్‌ కొలంబియాలో కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఓ సీనియర్‌ మిలిటరీ అధికారి ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి ప్రతికూల వాతవరణ పరిస్థితులే కారణంగా భావిస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. కొలంబియా అధ్యక్షుడు మాన్యుయల్‌ సాంటోస్‌ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement