నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!

52 Years Old Man Said To Police After Speed Driving He Was Cheating On Wife - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా పోలీసులకు ఓ విచిత్ర సంఘటన ఎదురైంది. అదివారం రాత్రి 52ఏళ్ల వృద్దుడు అధిక వేగంతో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు విచారించగా.. అతడు చెప్పిన సమాధానం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే...ఫ్లొరిడాకు చెందిన జాన్‌ ఎర్ల్‌ పికార్డ్‌(52) 88 కిలోమీటర్ల స్పీడు లిమిట్‌ ఉన్న రహదారిపై 144 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుని నిలదీయగా.. తాను భార్యను మోసం చేస్తున్నానని, అందుకే తొందరగా ఇంటికి వెళ్లేందుకు స్పీడ్‌గా వెళుతున్నానంటూ సమాధానం ఇచ్చాడు.

అయితే వృద్దుడు డ్రైవింగ్‌ చేస్తున్న ఆ రహదారిపై 88 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి కానీ.. అతను 144 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాడు. దీంతో పరిమితికి మించి రహదారిపై  నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ వెళ్లినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అరెస్టు చేసే సమయంలో అతని టీ షర్ట్‌ జేబులో  కోకైన్‌ గంజాయి ప్యాకెట్‌ కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు. కాగా దానిని పికార్డ్‌ 50 డాలర్లకు కొనుగోలు చేసినట్లు స్వయంగా ఒప్పుకోవడంతో ఆదనంగా అతనిపై మాదకద్రవ్యాల కేసు నమోదు చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top