ఆ తల ఎవరిదో తెలిసింది..!!

4000 Year Old Mummy Mystery Revealed - Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : నాలుగు వేల సంవత్సరాల క్రితం మరణించిన ఓ వ్యక్తి తల వెనుక దాగివున్న రహస్యాన్ని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) చేధించింది. 1915లో ఈజిప్టులోని డెయిర్‌ ఎల్‌ బర్షా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుండగా వారికి ఓ మమ్మీ తల లభ్యమైంది.

అయితే, ఎంత ప్రయత్నించినా మమ్మీ ఏ కాలానికి చెందినదో వారు కనుక్కోలేకపోయారు. 1920 నుంచి తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమైన వస్తువులు అన్నింటిని(మమ్మీ తలతో సహా) బోస్టన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ మ్యూజియంలో భద్రపరిచారు.

తాజాగా దాదాపు 100 ఏళ్ల తర్వాత మమ్మీ తల వెనుక దాగివున్న మిస్టరీని ఎఫ్‌బీఐ బయటపెట్టింది. మమ్మీ పన్నుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా అది ఒక పురుషుడిగా తేలిందని ఎఫ్‌బీఐ ‘జెనెస్‌’  అనే జర్నల్‌లో పేర్కొంది. డీఎన్‌ఏ పరీక్షల్లో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు అంటున్నారు.

నిజానికి ఆ మమ్మీ తల అప్పటి బ్రిటీష్‌ గవర్నర్‌ డ్జేహుటైనాక్ట్‌ది అని ఎఫ్‌బీఐ తెలిపింది. గవర్నర్‌ దంపతుల మరణం అనంతరం వారిని ప్రత్యేక ప్రదేశంలో పూడ్చిపెట్టారని చెప్పింది. కానీ దొంగలు వారి శరీరంపై ఉన్న ఆభరణాల కోసం 30 అడుగుల లోతులో పాతిపెట్టిన శవపేటికను తవ్వి తీశారని వివరించింది. ఆ తర్వాత ఆభరణాలను చోరీ చేసి పేటికను దగ్గరలోని గుహలో పడేశారని వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top