అమెరికాలో కాల్పులు.. | 4 dead in Halloween party shooting in San Francisco Bay Area | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు..

Nov 2 2019 4:19 AM | Updated on Nov 2 2019 4:19 AM

4 dead in Halloween party shooting in San Francisco Bay Area - Sakshi

కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చోటు చేసుకుంది. హలోవీన్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో అకస్మాత్తుగా కాల్పులు చోటు చేసుకున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా కమ్యూనిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి అత్యంత ధనికులు నివాసముండే ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే 100 మంది హలోవీన్‌ విందు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. కాల్పులకు కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, కాసేపటికి పోలీసులు వచ్చారని, అంబులెన్స్‌ల్లో పలువురిని తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement