వేగంగా వెళ్తున్న బస్సు వాహనాలను ఓవర్‌టేక్ చేసే యత్నంలో..
నైరోబీ: వేగంగా వెళ్తున్న బస్సు వాహనాలను ఓవర్‌టేక్ చేసే యత్నంలో ఎదురుగా వస్తున్న రెండు ట్రక్కులను ఢీ కొట్టడంతో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కెన్యా రాజధాని నైరోబీకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిలి్జల్ గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగింది. ముందున్న వాహనాలను అధిగమించే క్రమంలో బస్సు డ్రైవర్ వేగంగా ఎదురుగా వస్తున్న రెండు ట్రక్కులను ఢీ కొట్టాడు. దీంతో అక్కడికక్కడే 18 మంది చనిపోయారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కెన్యాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 12 వేల మంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.