'పార్లమెంట్లో చర్చ జరగకపోవడం బాధాకరం' | ysrcp mps speaks after parliament Postponed over currency problems | Sakshi
Sakshi News home page

'పార్లమెంట్లో చర్చ జరగకపోవడం బాధాకరం'

Dec 16 2016 4:30 PM | Updated on Sep 22 2018 7:51 PM

'పార్లమెంట్లో చర్చ జరగకపోవడం బాధాకరం' - Sakshi

'పార్లమెంట్లో చర్చ జరగకపోవడం బాధాకరం'

పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ ఎంపీలు అన్నారు.

ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం పార్లమెంటు ఉభయ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, బుట్టారేణుక మీడియాతో మాట్లాడారు.

నోట్ల రద్దుతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి సూచించారు. ప్రధాని ఇచ్చిన 50 రోజుల గడువుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని గుర్తుకు చేశారు. వచ్చే రెండు వారాల్లో ప్రధాని మోదీ ఆశించిన ఫలితాలు వస్తాయనేది అనుమానమేనన్నారు. దేశంలోని అనేక గ్రామాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ లేదని చెప్పారు. గ్రామాల్లో మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement