వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణ యూత్‌ విభాగం నియామకాలు | YSR Congress Telangana Youth Section appointments | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణ యూత్‌ విభాగం నియామకాలు

Mar 13 2017 2:55 AM | Updated on Jul 25 2018 4:42 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ యువజన విభాగంలో వివిధ నియామకాలు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా బూర సుమన్‌ గౌడ్, ఇ.సురేందర్‌రెడ్డి, కార్యదర్శులుగా

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ యువజన విభాగంలో వివిధ నియామకాలు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా బూర సుమన్‌ గౌడ్, ఇ.సురేందర్‌రెడ్డి, కార్యదర్శులుగా సి.రాజేందర్, ఇ.హరీశ్, మంచిర్యాల జిల్లా యువజన అధ్యక్షుడిగా వి.కిరణ్‌ ప్రకాశ్‌ నియమితులయ్యారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్‌ ఈ నియామకాలు చేశారు. ఆదివారం ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement