'భోగభాగ్యాలతో అలరారాలి' | YS Jaganmohan reddy extends sankranti greetings to telugu people | Sakshi
Sakshi News home page

'భోగభాగ్యాలతో అలరారాలి'

Jan 13 2017 3:20 AM | Updated on Apr 4 2018 9:25 PM

'భోగభాగ్యాలతో అలరారాలి' - Sakshi

'భోగభాగ్యాలతో అలరారాలి'

తెలుగు వారందరికీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు  

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలు ప్రసాదించాలని, భోగిమంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో ఇంటింటా వేడుకలతో సంక్రాంతి వేళ తెలుగు ప్రజలు అలరారాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పేరు చెప్పగానే పల్లెలు, రైతులు గుర్తుకొస్తారని, రైతన్న, పల్లెసీమలు సుభిక్షంగా పాడిపంటలతో సంతోషంగా ఉండాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటానని తన సంక్రాంతి సందేశంలో జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement