ఆరోగ్యమిత్రలపై జులుం దుర్మార్గం | YCP Leader vasireddy padma fires on ap government | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమిత్రలపై జులుం దుర్మార్గం

Jan 26 2016 3:35 AM | Updated on Aug 20 2018 4:17 PM

ఆరోగ్యమిత్రలపై జులుం దుర్మార్గం - Sakshi

ఆరోగ్యమిత్రలపై జులుం దుర్మార్గం

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యమిత్రలను తొలగించడం అన్యాయమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

వారిని పునర్ నియమించాలి: వైఎస్సార్‌సీపీ
 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు కోల్పోయి ఆందోళనకు సిద్ధమవుతున్న ఆరోగ్యమిత్ర ఉద్యోగులపై పోలీసులు జులుం చేయడం దుర్మార్గమైన చర్య అని తొలగించిన వారిని తిరిగి నియమించే విషయాన్ని పరిశీలించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

తమ పొట్టగొట్టొద్దని కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించడానికి విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన ఆరోగ్యమిత్రలను  పోలీసులు అడ్డుకుని అణ చి వేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఉద్యోగం పోయిందనే క్షోభతో నెల్లూరులో సుమలత అనే ఆరోగ్యమిత్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయం తెలుసుకుని చాలా ఆవేదన చెందారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement