పెళ్లైన నాలుగు నెలలకే.. | women commits suicide over husband harassments | Sakshi
Sakshi News home page

పెళ్లైన నాలుగు నెలలకే..

Jul 3 2017 4:26 PM | Updated on Sep 5 2017 3:06 PM

పెళ్లైన నాలుగు నెలలకే భర్త వేధింపులకు ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌: పెళ్లైన నాలుగు నెలలకే భర్త వేధింపులకు విసిగిపోయిన ఓ నవవధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని అల్వాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న నీరజారెడ్డి(27)కి జీడిమెట్లకి చెందిన సుచిన్‌రెడ్డితో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది.
 
కొన్ని రోజులు సాఫీగా సాగిన వారి కాపురం తర్వాత గొడవలకు దారితీసింది. ప్రతి చిన్నవిషయానికి భర్త తనతో గొడవకు దిగుతుండటంతో.. మనస్తాపానికి గురైన నీరజ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement