ఉల్లాసంగా మహిళా సైక్లథాన్‌ | Women as exhilaration saiklathan | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా మహిళా సైక్లథాన్‌

Mar 6 2017 12:58 AM | Updated on Mar 19 2019 9:20 PM

ఉల్లాసంగా మహిళా సైక్లథాన్‌ - Sakshi

ఉల్లాసంగా మహిళా సైక్లథాన్‌

మహిళల సైక్లథాన్‌ ఉల్లాసంగా...ఉత్సాహంగా సాగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నానక్‌రాంగూడలోని

రాయదుర్గం: మహిళల సైక్లథాన్‌ ఉల్లాసంగా...ఉత్సాహంగా సాగింది.  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నానక్‌రాంగూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం 25 కిలో మీటర్ల సైక్లథాన్‌ నిర్వహించారు. గచ్చిబౌలి షీ టీమ్‌ ఇన్‌చార్జి. ఇన్‌స్పెక్టర్‌ సునీత, కాంటినెంటల్‌ ఆస్పత్రి సీఓఓ హరీష్‌మానియన్‌ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సైక్లథాన్‌లో డాక్టర్లతో పాటు 480 మంది  పాల్గొన్నారు. జయంతి అనే మహిళ 25 కిలో మీటర్ల దూరాన్ని 48 నిమిషాల్లో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలవడగా, శిప్రా అనే మహిళ రెండు స్థానం కైవసం చేసుకుంది. అనంతరం నిర్వాహకులు 300 మంది విద్యార్థులకు కొత్త షూలు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement