సచివాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం | woman suicide attempt at andhra pradesh secratariat | Sakshi
Sakshi News home page

సచివాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Aug 4 2015 4:26 PM | Updated on Aug 18 2018 4:13 PM

ఆంధ్ర్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

హైదరాబాద్ : ఆంధ్ర్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సమస్యలు చెప్పుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసేందుకు అర్చన అనే మహిళ సచివాలయానికి వచ్చింది. అయితే పోలీసులు ఆమెను తెలంగాణ సచివాలయంలోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన అర్చన ఏపీ సచివాలయం ఎదుటు తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తక్షణం స్పందించిన సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement