'ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే' | west zone dcp comments on ravela kishore babu | Sakshi
Sakshi News home page

'ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే'

Mar 6 2016 1:13 PM | Updated on Sep 3 2017 7:09 PM

'ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే'

'ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే'

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్పై వేధింపుల కేసు నమోదు చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్పై వేధింపుల కేసు నమోదు చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం నగరంలోని వెస్ట్జోన్ డీసీపీ కార్యాలయంలో వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... బాధితురాలి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చెప్పారు.

సుశీల్, డ్రైవర్ అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. బాధితురాలిని వెంబడించిన కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే అని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ఈ కేసులో అన్ని అంశాలను పరిశీలించాకే సుశీల్పై నిర్భయ కేసు నమోదు చేశామని డీసీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement