'కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఉంది' | we will win Telangana legislative council chairman, says Congress party MLC D.Srinivas | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఉంది'

Jul 1 2014 1:00 PM | Updated on Mar 18 2019 7:55 PM

'కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఉంది' - Sakshi

'కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఉంది'

మండలి ఛైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీఎస్ స్పష్టం చేశారు.

మండలి ఛైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ పక్ష నాయకుడు డి.శ్రీనివాస్ (డీఎస్) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... శాసనమండలి ఛైర్మన్ ఎన్నికకు రహస్య బ్యాలెట్ పెట్టడం సరికాదని డిఎస్ అభిప్రాయపడ్డారు. ఇంత హడావుడిగా కౌన్సిల్ సమావేశం ఎందుకు అంటు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెషన్ను గవర్నర్ను కోరినప్పటికీ  ప్రయోజనం లేదన్నారు.

 

ఛైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీ ఎమ్మెల్సీలను కోరామని చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ పదవిని గెలుస్తామని తమకు నమ్మకం ఉందని డీఎస్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మండలి ఛైర్మన్ పదవికి బుధవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి స్వామిగౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి పారూక్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement