
గెలిచే సత్తా ఉంది: మంత్రి దానం
బంజారాహిల్స్, : నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని మంత్రి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్, నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని మంత్రి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ డివి జన్ పరిధిలో దీపం పథకం కింద మం జూరైన గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు ఆయన మంగళవారం ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఏ డివిజన్‌లో ఎంత అభివృద్ధి చేశానో తాను నిరూపిస్తానని కొత్తగా వస్తున్న పార్టీల నాయకులు ఏంచేస్తారో చెబుతారా అని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా చివరకు గెలిచేది తానేనని, ఆ సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా 250 మంది లబ్ధిదారులకు దీపం పథకం కింద కనెక్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ బి.భారతి, జీహెచ్‌ఎంసీ సర్కిల్-10 యూసీడీ డిప్యూటీ పీవో కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.