అత్త ‘కారు’.. కోడలు ‘సైకిల్’ | War in same family | Sakshi
Sakshi News home page

అత్త ‘కారు’.. కోడలు ‘సైకిల్’

Jan 21 2016 5:37 AM | Updated on Aug 10 2018 8:16 PM

అత్త ‘కారు’..  కోడలు ‘సైకిల్’ - Sakshi

అత్త ‘కారు’.. కోడలు ‘సైకిల్’

గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని చిత్ర విచిత్రాలో.. బంధువులు ప్రత్యర్థులవుతున్నారు. ప్రత్యర్థులు ఒకటవుతున్నారు.

కూకట్‌పల్లి: గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని చిత్ర విచిత్రాలో.. బంధువులు ప్రత్యర్థులవుతున్నారు. ప్రత్యర్థులు ఒకటవుతున్నారు. కూకట్‌పల్లి వివేకానందనగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మొదట మాధవరం స్వాతిని ఖరారు చేశారు. అయితే స్వాతి పేరు ఓటర్ లిస్ట్‌లో లేకపోవడంతో ఆమె తల్లి ఎం.లక్ష్మిబాయిని రంగంలోకి దింపారు. కాగా బాలాజీనగర్ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా లక్ష్మీబాయి సొంత అన్న కూతురు గోనె రూప అంతకముందే బరి లో ఉన్నారు. దీంతో కోడలు సైకిలెక్కితే.. అత్త కారెక్కిందని స్థానికులు చమత్కరిస్తున్నారు. వీరిద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడంతో పాపం బంధువులు పడరాని కష్టాలు పడుతున్నారు. ఓ పూట అత్త పార్టీకి, మరో పూట కోడలు పార్టీకి మద్దతు పలుకుతూ ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement