వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం | Venkaiah naidu Rally From Begumpet Airport To BJP State office in Hyderabad | Sakshi
Sakshi News home page

వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం

May 31 2014 11:03 AM | Updated on Mar 29 2019 6:01 PM

వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం - Sakshi

వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం లభించింది.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో వెంకయ్యకు ఆ పార్టీ ఎంపీలు బండారు దత్తాత్రేయ, విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబుతోపాటు పలువురు సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బేగంపేట నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ఆ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుమలలో ఈ రోజు తెల్లవారుజామున కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. అనంతరం బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమైయ్యారు. ఆ తర్వాత రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కు పయనమైన సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement