నోట్ల రద్దు.. అరాచక, రాక్షస చర్య: వీహెచ్ | v hanumantha rao comments on currency ban | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు.. అరాచక, రాక్షస చర్య: వీహెచ్

Nov 26 2016 2:29 PM | Updated on Sep 22 2018 7:51 PM

ప్రజలు మేక్ ఇండియా కోసం కాదు.. పొట్ట కూటి కోసం బ్యాంకు లైన్లలో నిలబడుతున్నారని వి. హనుమంతరావు విమర్శించారు.

హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిలు చూస్తుంటే.. ఇందిరా గాంధీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ప్రజలు మేక్ ఇండియా కోసం కాదు.. పొట్ట కూటి కోసం బ్యాంకు లైన్లలో నిలబడుతున్నారని విమర్శించారు. ప్రజల కరెన్సీ కష్టాలను బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంలో కేసీఆర్ విఫలమయ్యారని.. నోట్ల రద్దు అరాచక, రాక్షస చర్య అని దుయ్యబట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement