లారీ, బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు | two injured in lorry, bike accident | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు

Jul 17 2015 7:36 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.

హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. వివరాలు.. హయత్ నగర్‌కు చెందిన సంతోష్‌రెడ్డి (28) తన స్నేహితుడితో కలిసి బైక్‌పై హయత్‌నగర్ నుంచి పనామాకు వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా.. సంతోష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement